నాయకులు మంచి నిర్వాహకులు

సహవాసం

మనం చివరిసారిగా కలిసినప్పటి నుండి మీకు జరిగినదాని ఆధారంగా, దేనికి మీరు కృతజ్ఞతతో ఉన్నారు?
ఈ వారం మిమ్మల్ని ఒత్తిడికి గురి చేసింది ఏంటి, మరియు పరిస్థితులు మెరుగ్గాఉండాలంటే మీకు కావలసింది ఏమిటి?
మీ కమ్యూనిటీలోని ప్రజల అవసరాలు ఏమిటి, మరియు మనం తెలియచేసిన అవసరాలను తీర్చడంలో ఒకరికొకరం ఎలా సహాయం చేసుకోవచ్చు?
మనం గతసారి కలిసినప్పుడు నేర్చుకున్న కథ ఏమిటి? దేవుని గురించి మరియు ప్రజల గురించి మనం ఏమి నేర్చుకున్నాము ?
మన గత సమావేశంలో, మీరు నేర్చుకున్న వాటిని అన్వయించుకోవాలని నిర్ణయించుకున్నారు . మీరు ఏమి చేసారు మరియు అది ఎలా జరిగింది?
గత కథలోని విషయాలను మీరు ఎవరితో పంచుకున్నారు? వారు ఎలా స్పందించారు?
మనం చివరిసారి కలిసినప్పుడు అనేక అవసరాలను గుర్తించాము మరియు ఆ అవసరాలను తీర్చడానికి ప్రణాళిక వేసుకున్నాము. అది ఎలా జరిగింది?
ఇప్పుడు, దేవుని నుండి ఒక కొత్త కథ విందాం...

మత్తయి 25: 14-30

¹⁴ “పరలోక రాజ్యం ఇలా ఉంటుంది, ఒక మనిషి దూరదేశానికి ప్రయాణమై తన పనివారిని పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించాడు. ¹⁵ వారి వారి సామర్ధ్యం ప్రకారం ఒకడికి ఐదు తలాంతులూ ఇంకొకడికి రెండు తలాంతులూ మరొకడికి ఒక్క తలాంతూ ఇచ్చి, వెంటనే ప్రయాణమై వెళ్ళాడు. ¹⁶ ఐదు తలాంతులు తీసుకున్న వాడు వాటితో వ్యాపారం చేసి, ఇంకో ఐదు తలాంతులు సంపాదించాడు. ¹⁷ అదే విధంగా రెండు తలాంతులు తీసుకున్న వాడు ఇంకో రెండు సంపాదించాడు. ¹⁸ అయితే ఒక తలాంతు తీసుకున్న వాడు వెళ్ళి, గుంట తవ్వి తన యజమాని డబ్బు దాచిపెట్టాడు. ¹⁹ “చాలా కాలం తరువాత ఆ యజమాని తిరిగి వచ్చి తన పనివారి దగ్గర లెక్కలు చూసుకున్నాడు. ²⁰ అప్పుడు ఐదు తలాంతులు తీసుకున్న వాడు మరో ఐదు తలాంతులు తెచ్చి ‘అయ్యగారూ, మీరు నాకు ఐదు తలాంతులు ఇచ్చారు కదా, అవి గాక నేను ఇంకో ఐదు తలాంతులు సంపాదించాను’ అని చెప్పాడు. ²¹ అతని యజమాని, ‘ఆహా! నీవు నమ్మకమైన మంచి పనివాడివి! నీవు ఈ చిన్నపాటి విషయంలో నమ్మకంగా ఉన్నావు. కాబట్టి నిన్ను ఎక్కువ పనుల మీద నియమిస్తాను. నీ యజమాని సంతోషంలో నీవు కూడా భాగం పంచుకో’ అన్నాడు. ²² అలాగే రెండు తలాంతులు తీసుకున్న వాడు వచ్చి, ‘అయ్యగారూ, మీరు నాకు రెండు తలాంతులు ఇచ్చారు కదా, అవి గాక నేను ఇంకో రెండు తలాంతులు సంపాదించాను’ అని చెప్పాడు. ²³ యజమాని, ‘ఆహా! నీవు ఈ చిన్నపాటి విషయంలో నమ్మకంగా ఉన్నావు. కాబట్టి నిన్ను ఎక్కువ పనుల మీద నియమిస్తాను. నీ యజమాని సంతోషంలో నీవు కూడా భాగం పంచుకో’ అన్నాడు. ²⁴ తరువాత ఒక్క తలాంతు తీసుకున్నవాడు వచ్చాడు. అతడన్నాడు, ‘అయ్యగారూ, మీరు విత్తనాలు నాటని చోట పంట కోయడానికీ, వెదజల్లని చోట పంట పోగుచేసుకోడానికీ చూసే కఠినాత్ములని నాకు తెలుసు. ²⁵ కాబట్టి నాకు భయం వేసి, మీరిచ్చిన తలాంతును భూమిలో దాచిపెట్టాను. ఇదిగో, తీసుకోండి’ అన్నాడు. ²⁶ అందుకు ఆ యజమాని అతనితో, ‘నీవు సోమరివాడివి! చెడ్డ దాసుడివి. నేను విత్తని చోట కోసేవాడిని, వెదజల్లని చోట పంట పోగుచేసుకో జూసేవాడిని అని నీకు తెలుసు గదా! ²⁷ అలాంటప్పుడు నీవు నా డబ్బును వడ్డీ వ్యాపారుల దగ్గర ఉంచాల్సింది. అప్పుడు నేను వచ్చి దాన్ని వడ్డీతో కలిపి తీసుకుని ఉండేవాణ్ణి’ అని చెప్పి, ²⁸ ‘ఆ తలాంతును వాడి దగ్గర నుండి తీసుకుని పది తలాంతులు ఉన్నవాడికి ఇవ్వండి. ²⁹ ఉన్న ప్రతివాడికీ మరింత ఇవ్వడం జరుగుతుంది, అతడు సమృద్ధి కలిగి ఉంటాడు. లేని వాడి దగ్గర నుండి వాడికి ఉన్నది కూడా తీసివేయడం జరుగుతుంది. ³⁰ పనికిమాలిన ఆ దాసుణ్ణి బయట ఉన్న చీకటిలోకి తోసివేయండి. అక్కడ ఏడుపు, పండ్లు కొరుక్కోవడం ఉంటాయి.

Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible Copyright © 2016 by The Bible Society of India Used by permission. All rights reserved worldwide. Copyright © by the Bible Society of India. Used by permission. All rights reserved.

అన్వయింపు

ఇప్పుడు, ఈ వచనాన్ని వినని స్నేహితుడికి చెప్పినట్లుగా ఎవరైనా ఈ వచనాన్ని తమ సొంత మాటలతో చెప్పనివ్వండి. ఏదైనా విడిచిపెట్టినా లేదా పొరపాటున ఏదైనా చేర్చినా వారికి సహాయం చేద్దాం. అలా జరిగితే మనం "కథలో అది ఎక్కడ కనిపిస్తుంది?" అని అడగవచ్చు.
ఈ కథ దేవుని గురించి, ఆయన స్వభావం గురించి, ఆయన చేసే పనుల గురించి మనకు ఏమి బోధిస్తుంది?
ఈ కథ నుండి మన గురించి, మరియు ఇతరుల గురించి మనం ఏమి నేర్చుకుంటాము?
నాయకులుగా (ఉండుట వలన) ఈ కథ నుండిమనం ఏమి నేర్చుకుంటాము?
ఈ వారం మీ జీవితంలో ఈ కథలోని దేవుని సత్యాన్ని మీరు ఎలా అన్వయించుకుంటారు? మీరు చేసే నిర్దిష్ట చర్య లేదా పని ఏమిటి?
మనం తిరిగి కలవడానికి ముందు ఈ కథ నుండి ఒక సత్యాన్ని ఎవరితో పంచుకుంటారు? మనలాగే ఈ యాప్‌లో దేవుని వాక్యాన్ని కనుగొనడం ఇష్టపడే ఇతరులు మీకు తెలుసా?
మన సమావేశం ముగిసే సమయానికి, మనం మళ్ళీ ఎప్పుడు కలుద్దాం మరియు మన తదుపరి సమావేశాన్ని ఎవరు ఏర్పాటు చేస్తారో నిర్ణయించుకుందాం.
కలిసి గడిపిన ఈ సమయం చాలా బాగుంది. మీరు ఏమి చేస్తారని చెప్పారో గమనించమని మరియు మనం మళ్ళీ కలిసే ముందు రోజుల్లో ఈ కథను మళ్ళీ వినమని మేము మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాము. ఎవరి దగ్గరైనా కథ టెక్స్ట్ లేదా ఆడియో లేకపోతే ఫెసిలిటేటర్ వారితో పంచుకోవచ్చు. మనం ముందుకు వెళ్తూ, మనకు సహాయం చేయమని ప్రభువును అడుగుదాం.

0:00

0:00